Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ – 7 తెలుగు అతి త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన పార్టిసిపెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. ఈసారి సీజన్ లో మొత్తం 21మంది పార్టిసిపెంట్స్ ఉండబోతున్నారని, మరో 3మంది వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరి వాళ్లు ఎవరో ఒక లుక్కేద్దామా..

1) ఫోక్ సింగర్ భోలే షవాలి

యూట్యూబ్ లో ఫేమస్ సాంగ్స్ పాడుతూ ఫోక్ సింగర్ భోలో షవాలి చాలా పేమస్ అయ్యాడు. రీసంట్ గా కష్టపడ్డా, పాలమ్మా అనే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, ఇప్పటివరకూ చాలా పాటలు తనే రాసి కంపోజ్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు. అన్ని పాటలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. కరోనా సాంగ్, నేను తెలంగాణా పోరడ్ని ఇలాంటి పాటలు బాగా హిట్ అయ్యాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా, పాటల రచయితగా, సింగర్ గా భోలో షవాలి సోషల్ మీడియాలో తన మార్క్ వేశాడు. అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ – 7 కోసం సెలక్ట్ అయినట్లుగా టాక్.

2) అమర్ దీప్

సీరియల్ ఆర్టిస్ట్ గా అమర్ దీప్ అందరికీ సుపరిచితమే. అమర్ కి జానకి కలగనలేదు సీరియల్ తో మంచి బ్రేక్ వచ్చింది. దీంతో స్టేజ్ షోలు, టీవి షోలలో పార్టిసిపేట్ చేశాడు. అడపదడపా చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం స్టార్ మా నీతోనే డ్యాన్స్ షోలో తన భార్యతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాడు. నిజానికి వీళ్లిద్దరూ కపుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపించింది. కానీ, అమర్ దీప్ ఒక్కడే సోలోగా బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు సీజన్ – 7లోకి అడుగుపెట్టబోతున్నాడు.

3) సందీప్ కపుల్ – కొరియోగ్రాఫర్

ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ షో చేస్తున్ సందీప్ ఈసారి బిగ్ బాస్ – 7లోకి అడుగుపెట్టబోతున్నాడు. రీసంట్ గా సందీప్ లవ్ యూ టూ అనే మూవీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన డ్యాన్స్, యాక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. అలాగే, తన వైఫ్ తో కలిసి చేసే రీల్స్ ఇన్ స్ట్రాగ్రామ్ లో చాలా ఫేమస్. మరి వీళ్లిద్దరూ కపుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా. లేదా సందీప్ సోలోగా గేమ్ ఆడతాడా అనేది చూడాలి.

4) బుల్లెట్ భాస్కర్

జబర్ధస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. లాస్ట్ టైమ్ బిగ్ బాస్ లోకి వెళ్లిన ఫైమా బుల్లెట్ భాస్కర్ టీమ్ మేట్. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ తనదైన స్టైల్లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈసీజన్ లో ఎలాంటి పంచ్ లతో కామెడీ చేస్తాడు అనేది చూడాలి.

5) అంజలీ పవన్

బిగ్ బాస్ సీజన్ – 7లో అంజలీ పవన్ సోలోగా అడుగుపెట్టబోతోందని టాక్. నీతోనే డ్యాన్స్ షోతో అందర్నీ ఆకట్టుకున్న అంజలీ ఆర్టిస్ట్ గా కూడా అందరికీ సుపరిచితమే. గతంలో చిన్న బడ్జెట్ సినిమాలకి హీరోగా చేసిన సంతోష్ పవన్ ని పెళ్లి చేసుకుంది అంజలీ. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ – 7లో ఏం చేయబోతుందనేది చూడాలి.

6) మహేష్ ఆచంట

సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తుంపుని తెచ్చుకున్నాడు మహేష్ ఆచంట. ముఖ్యంగా రంంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఫ్రెండ్ గా చేసిన క్యారెక్టర్ తనకి బాగా గుర్తింపుని తెచ్చిపెట్టింది. అలాగే, మహానటి సినిమాలో కీర్తి సురేష్ పక్కనే ఉంటూ కన్నింగ్ క్యారెక్టర్ చేశాడు. ఇది కూడా మహేష్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ – 7లో తన మార్క్ ని చూపించేందుకు వస్తున్నాడని టాక్. మరి చూద్దాం ఏం చేస్తాడు అనేది.

7) సింగర్ – మోహన భోగరాజు

ఫోక్ సాంగ్స్ పాడటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న సింగర్ మోహన భోగరాజ్. ముఖ్యంగా నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా గా.. అనే పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో సాంగ్స్ పాడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ – 7లో తన పాటలతో హల్ చల్ చేయబోతోందనేది టాక్.

8) శోభాశెట్టి

ఆర్టిస్ట్ శోభాశెట్టి అనేకంటే మోనితా అంటేనే అందరూ బాగా గుర్తుపడతారు. అంతలా ఆ క్యారెక్టర్ చేసి ఆడవాళ్లకి శత్రువుగా తయారయ్యింది శోభాశెట్టి. కార్తీకదీపం సీరియల్ ఎంత పెద్ద హిట్టో, మోనిత క్యారెక్టర్ కూడా అంతే పెద్ద హిట్. ఇప్పుడు తను పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసేలా లేరు. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ – 7లోకి అడుగుపెట్టబోతోందనేది టాక్. మరి చూద్దాం శోభాశెట్టి అలియాస్ మోనిత ఏం చేయబోతోందనేది.

9) నవ్యస్వామి

సీరియల్ ఆర్టిస్ట్ గా, సినిమా హిరోయిన్ గా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పడే సెటిల్ అవుతోంది నవ్యస్వామి. ఆమె కథ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రావణాసుర, బుట్టబొమ్మ, ఇంటింటి రామాయణం సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ – 7లోకి అడుగుపెట్టబోతోంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పెర్పామన్స్ చేస్తుందో చూడాలి.

10) కాస్కో నిఖిల్

యూట్యూబ్ చూసేవాళ్లకి కాస్కో నిఖిల్ అంటే పరిచయం అక్కర్లేదు. తన ఇంటర్య్వూస్ ద్వారా, వీడియోస్ ద్వారా ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తునే ఉంటాడు. నిజానికి నిఖిల్ సీజన్ – 5 , సీజన్ – 6లోనే బిగ్ బాస్ లోకి వెళ్లాలి. కానీ, ఈసారి సీజన్ – 7లో తన సత్తా చాటేందుకు రాబోతున్నాడనేది టాక్. మరి తన గేమ్ తో హౌస్ లో ఏం చేస్తాడు ? ఎలా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తాడు అనేది ఆసక్తికరం.

11) సింగర్ థామిని

పచ్చబొట్టేసిన అంటూ అందరి మనసులు కట్టిపారేసిన సింగర్ ధామిని బిగ్ బాస్ సీజన్ – 7లోకి అడుగు పెట్టబోతోందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిర్మలా కాన్వెంట్, స్పీడున్నోడు, సైజ్ జీరో ఇలా ఎన్నో సినిమాల్లో పాటలు పాడి తన సత్తా చాటింది. తెలుగులో సింగర్ ధామినికి పచ్చబొట్టేసిన పాట ఎంతో గుర్తుంపుని తెచ్చింది. మరి ఈ బిగ్ బాస్ స్టేజ్ ని ఈ అమ్మడు ఎలా వాడుకుంటుందనేది చూడాలి.

12) శ్వేతనాయుడు

సోషల్ మీడియాలో తన డ్యాన్స్ తో యూత్ ని ఆకట్టుకున్న అమ్మాయి శ్వేతనాయుడు. ఆర్టిస్ట్ గా, ఇన్ స్ట్రాగ్రామ్ ఇన్ఫులెన్సర్ గా ఎంతో పేరు తెచ్చుకుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 డోర్ కొట్టబోతోంది ఈ అమ్మడు. మరి ఎలాంటి పెర్ఫామన్స్ ఇస్తుంది ? తన గ్లామర్ తో ఎంతమందిని ఆకట్టుకుంటుందనేది చూడాలి.

13) అనిల్ గీలా

మై విలేజ్ షో ద్వారా చాలా పాపులారిటీని సంపాదించుకున్నాడు. గంగవ్వ ఎపిసోడ్స్ లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని వేశాడు. నిజానికి సీజన్ – 6లోనే అనిల్ గీలా వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ – 7లోకి అడుగుపెట్టబోతున్నాడు. మరి గేమ్ ఎలా ఆడతాడు అనేది చూడాలి.

14) శుభశ్రీ

శుభశ్రీ అనగానే చాలామందికి మాలశ్రీ సిస్టర్ గుర్తుకు వస్తుంది. కానీ, ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చినపుడు తనపేరు శుభశ్రీ అనే ఉండాలని పట్టుబట్టిందట. అమిగోస్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన శుభశ్రీ తర్వాత రుద్రవీణ సినిమాలో లీడ్ హీరోయిన్ గా చేసింది. యాంకర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మాయి హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే మంచి గుర్తుంపుని తెచ్చుకుంటోంది. లాయర్ గా, స్పోర్ట్స్ పర్సన్ గా , మోడల్ గా ఎన్నో అవార్డ్స్ – రివార్డ్స్ గెలుచుకున్నశుభశ్రీ బిగ్ బాస్ సీజన్ – 7లోకి వెళ్లబోతోందనేది టాక్.

15) శ్రావణి – బ్యాంకాక్ పిల్ల

తన యూట్యూబ్ వీడియోలతో బ్యాంకాక్ పిల్లగా అందర్నీ ఆకట్టుకుంది శ్రావణి. తన వీడియోలు ఎంత ఫేమస్ అంటే, చిన్నపిల్లల నుంచీ పెద్ద వాళ్ల వరకూ అందరూ చూసి కామెంట్స్ చేస్తుంటారు. బ్యాంకాక్ లో ఉన్న విషయాలు, తనకి జరిగిన అనుభవాలు అన్నీ వీడియో రూపంలో పెడుతూ బాగా ఫేమస్ అయ్యింది బ్యాంకాక్ పిల్ల. మరి ఈ బిగ్ బాస్ సీజన్ 7లో ఏం చేయబోతోందనేది చూడాలి.

16) ఆర్టిస్ట్ శంకర్ అంబటి

అగ్నిసాక్షి సీరియల్ లో బాగా ఫేమస్ అయ్యాడు శంకర్. అంతేకాదు, ఆర్టిస్ట్ గా వెండితెరపై కూడా కనిపించి అందర్నీ మెప్పించాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా శంకర్ కి మంచి పేరు ఉంది. ముఖ్యంగా దేవత సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. శంకర్ కూడా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టబోతున్నాడు అనేది టాక్.

17) ఆర్టిస్ట్ పూజా మూర్తి

గుండమ్మ కథ సీరియల్ కొనసాగింపులో గుండమ్మగా అందరికీ సుపరిచితురాలే. బెంగుళూర్ లో పుట్టిన పూజా మూర్తి ఆ తర్వాత కన్నడ సీరియల్స్ లో యాక్ట్ చేసింది. అక్కడ్నుంచీ తెలుగులో గుండమ్మ కథలో మైయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. ఇప్పుడు మరి బిగ్ బాస్ సీజన్ – 7లో కూడా లాస్ట్ మినిట్ లో పూజూ మూర్తిని తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. మరి ఈ అమ్మడు గేమ్ ఎలా ఆడుతుందనేది చూడాలి.

18) గౌతమ్ కృష్ణ

హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు గౌతమ్ కృష్ణ. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూనే హీరోగా ఆకాశవీధుల్లో అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ఇప్పుడిప్పుడే అందరూ గౌతమ్ కృష్ణని గుర్తు పట్టడం అనేది చేస్తున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ – 7లో గేమ్ ఎలా ఆడతాడు అనేది చూడాలి.

19) షకీలా

చివరి వరకూ షకీలా పేరు సస్పెన్స్ లోనే ఉంది. మలయాళం సినిమాల్లో షకీలా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బి – గ్రేడ్ సినిమాలు చేస్తూనే ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని వేసుకుంది. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ లైమ్ లైట్ లోనే ఉంది. మరి షకీలా లాంటి ఆవిడ బిగ్ బాస్ లోకి వస్తే టాస్క్ లు ఎలా ఆడుతుందనేది చూడాలి. అయితే, లాస్ట్ మినిట్ లో ఈమెని ఉంచుతారా లేదా అనేది సందేహమే.

20) సాగర్

మొగలిరేకులు ఆర్కే నాయుడు అంటే అందరూ గుర్తుపడతారు. సాగర్ ఫస్ట్ నుంచీ కూడా చాలా హుందా అయిన పాత్రలు మాత్రమే చేశాడు. మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ ఫ్రెండ్ గా కూడా నటించాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు హీరోగా చేసినా పెద్దగా ఫలితం రాలేదు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా లైమ్ లైట్ లో లేడు. మరి ఈ బిగ్ బాస్ సీజన్ – 7లోకి వస్తే ఎలా గేమ్ ఆడతాడు అనేది ఆసక్తికరం.

21) హీరోయిన్ ఫర్జానా

అల్లరి నరేష్ తో కలిసి సీమశాస్త్రి సినిమాలో హీరోయిన్ గా చేసింది. నిజానికి డ్యాన్సర్ – కొరియోగ్రాఫర్ అయిన ఫర్జానా ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. రీసంట్ గా తమిళంలో ఒక వెబ్ సీరిస్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీకి ట్రైనర్ గా వర్క్ చేస్తోంది. గేమ్స్ బాగా ఆడుతుంది. మరి ఫర్జానా లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ సీజన్ – 7లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ 21మందే కాకుండా చాలామందిని కూడా స్టాండ్ బై లో పెట్టినట్లుగా సమాచారం. వీరిలో జబర్ధస్త్ పొట్టి నరేష్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ట్రాన్స్ జెండర్ పల్లవి ప్రశాంత్, మోడల్ షీతల్ గౌతమ్, ఆర్టిస్ట్ ఐశ్వర్యా పిస్సే, ఇన్ స్ట్రాగ్రామ్ ఫేమ్ అన్షూరెడ్డి, టీవి సీరియల్ ఆర్టిస్ట్ క్రాంతి, ర్యాప్ సింగర్ మ్యాడీ, ఇలా కొంతమందిని సెలక్ట్ చేసి పెట్టుకున్నారు. వీళ్లలో ఎవరైనా సరే వైల్డ్ కార్డ్ గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి చూద్దాం.. వీరిలో ఎంతమంది (Bigg Boss Telugu 7) బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టి ట్రెండ్ సెట్ చేస్తారు అనేది.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus