Salaar Release Date: సలార్ నుండీ మంచి అప్డేట్ ఇచ్చారు.. కానీ..!

Advertisement

బాహుబలి తర్వాత ప్రభాస్ నుండీ వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు నిరాశపరిచాయి. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్,ప్రాజెక్ట్ కె… వంటి చిత్రాల పై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. వారి చూపంతా కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ పైనే ఉన్నాయి. కే.జి.ఎఫ్ రేంజ్ లో ప్రభాస్ తో ఓ సినిమా చేస్తాడు అని అంతా ఆశిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంటూ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

2022 లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ డేట్ వాయిదా వేసుకోక తప్పలేదు. ఇదిలా ఉండగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సలార్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2003 సెప్టెంబర్ 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రభాస్ రెండు కత్తులు పట్టుకుని శత్రుసంహారం చేస్తున్నట్టు ఈ పోస్టర్ ఉండగా …’ రెబలింగ్.. వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 28th 2023′ అంటూ అందులో రాసుకొచ్చారు.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సెప్టెంబర్ 28 ప్రభాస్ అభిమానులను డిజప్పాయింట్ చేసిన డేట్ అనే చెప్పాలి. అదే డేట్ కు 2012 లో రెబల్ అనే చిత్రం రిలీజ్ అయ్యింది. ప్రభాస్ రెండు హిట్లు కొట్టి ఫాంలో ఉన్న టైంలో ఆ మూవీ రిలీజ్ అయ్యింది.లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ సెప్టెంబర్ 28 నే రిలీజ్ అయ్యి పెద్ద ఫ్లాప్ అయ్యింది. మరి సలార్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news