కే జి ఎఫ్ సినిమాతో ఎంతో మంచి సంచలనం అందుకున్నటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఇకపోతే ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా రీమేక్ చిత్రం అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ వెల్లడించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు అయితే ఈ విషయాన్ని మాత్రం ప్రశాంత్ నీల్ తోసుపుచ్చారు.
సలార్ (Salaar) సినిమా రీమేక్ చిత్రం కాదని ఆయన వెల్లడించారు. ఉగ్రమ్ సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఆయన వెల్లడించారు. ఉగ్రమ్ లో శ్రీమురళి ఎలా చేసాడో చూశారు. ఇప్పుడు సలార్ లో ప్రభాస్ ఎలా చేశాడు అనేది చూస్తారనీ చెప్పగా రీమేక్ ఏమి కాదు. కొత్త కథతోనే వస్తున్నామనీ ప్రశాంత్ తెలిపారు. మొన్నటి వరకు యూట్యూబ్ లో ఉగ్రమ్ మూవీ హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు దానిని కూడా తొలగించారు.
ఈ విధంగా ఈ సినిమా రీమేక్ అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఉగ్రం సినిమాని యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా తొలగించడంతో కచ్చితంగా ఈ సినిమా రీమేక్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.దీంతో ఇప్పుడు ఈ రీమేక్ వార్తలు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాయి. రవి బస్రూర్ వీడియోని వైరల్ చేస్తూ.. సలార్ ఉగ్రమ్ కి రీమేక్ కావడంతోనే వర్జినల్ సినిమాని డిలీట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !