Salaar Movie: సలార్ సంచలనాలకు సిద్ధం కావాల్సిందే.. మామూలు ప్లానింగ్ కాదుగా!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ టీజర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. ఈ సినిమా రిలీజ్ కు మరో 80 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల ఆరో తేదీ సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు విడుదల కానున్న సలార్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసే టీజర్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ సినిమా టీజర్ ను 14 దేశాల్లో వేర్వేరు టైమింగ్స్ లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సంచలనాలను అభిమానులు సిద్ధం కావాల్సిందేనని సెప్టెంబర్ 28వ తేదీ బాక్సాఫీస్ షేక్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ప్రభాస్ అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ దాదాపుగా రెండు సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రభాస్, శృతి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కాగా సినిమాలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంటుందని సమాచారం అందుతోంది. టీజర్ తో సలార్ (Salaar) మూవీపై అంచనాలు రెట్టింపు అవుతాయేమో చూడాలి.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఈ టీజర్ ఉండనుందని తెలుస్తోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus