ఓటీటీలో స్టార్ హీరోయిన్ల సందడి!

  • January 30, 2021 / 04:01 PM IST

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్ ల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. వీరిద్దరిలో నెంబర్ వన్ ఎవరంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా జరిగేవి. కానీ కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో ఒకప్పటితో పోలిస్తే వీరు సినిమాలు చేయడం తగ్గించారు. అయితే మళ్లీ ఇంతకాలానికి వీరి మధ్య పోటీ మొదలైంది. అయితే ఈసారి ఓటీటీ వేదికగా పోటీ పడుతున్నారు. సమంత తొలిసారి ఓటీటీలోకి ఎంటర్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించింది. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుంది. ఫిబ్రవరి 12 నుండి సీజన్ 2 ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సరిగ్గా అదే రోజున కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ ను కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 12న ఈ హారర్ సిరీస్ ను రిలీజ్ చేయనున్నారు.

కాజల్ కు కూడా ఇది తొలి ఓటీటీ ఎంట్రీ. తాజాగా విడుదల చేసిన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతో ఈ రెండు సిరీస్ లపై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. మరి ఒకేసారి ఓటీటీ వెంచర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత-కాజల్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus