టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మాస్ చిత్రాలు తీసే దర్శకుల్లో ఒకప్పుడు వీవీ వినాయక్ ఉండేవాడు. అయితే ఇప్పుడు మాస్ సినిమాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను….తన తొలి సినిమా ‘భద్ర’ మొదలు కొని. ఇప్పటివరకూ భారీ మాస్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు శ్రీను…ఇక తాజాగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన సినిమా ‘సరైనోడు’ అయితే తెలుగులోనే కాదు….మలయాళంలో కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ప్రస్తుతం బోయపాటి మరో భారీ బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుట్టాడు…’అల్లుడు సీను’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్….ఆ తరువాత స్పీడున్నోడు అంటూ మరో సినిమాలో నటించాడు.
అయితే ఆ సినిమా కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది…ఇప్పుడు మళ్లీ తన మూడో సినిమా బోయపాటి దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్నాడు…ఇదిలా ఉంటే ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. హీరో ఇమేజ్ ని పక్కన పెడితే… బోయపాటి శ్రీను ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఈ మూవీని దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా…కొన్ని ప్రత్యేకమైన సీన్స్ లో, ఓ ప్రత్యేకమైన పాట కోసం సమంతని బోయపాటి శ్రీను ఒప్పించినట్టుగా ఇండస్ట్రీ నుండి టాక్స్ వినిపిస్తున్నాయి…చూద్దాం మరి ఇంతటి భారీ సినిమా అంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.