ఒక్క పోస్ట్ తో కొత్త కన్ఫ్యూజన్ ఏర్పడేలా చేసింది..!

  • August 28, 2020 / 09:12 PM IST

పెళ్లైనప్పటికీ కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే రాణిస్తూ వస్తోంది సమంత. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ఈమె స్టార్ డం ను మరింతగా పెంచుకుంది. ఇదిలా ఉండగా.. సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు చిన్మయి డబ్బింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఏ మాయ చేసావె’ చిత్రం నుండీ సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెబుతూ వస్తోంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా..! చిన్మయి ‘మీటూ’ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా సమంత అండగా నిలబడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్య కాలంలో సమంత .. చిన్మయి డబ్బింగ్ పై ఎక్కువగా ఆధారపడటం లేదు. ‘రంగస్థలం’ చిత్రంలో సమంత పాత్రకి జ్యోతి వర్మ డబ్బింగ్ చెప్పింది. ఆ తరువాత ‘మహానటి’ ‘యూ టర్న్’ వంటి చిత్రాల్లో సమంత ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది. అయితే ‘మజిలీ’ ‘ఓ బేబీ’ ‘జాను’ వంటి చిత్రాలకు మళ్ళీ సమంత పాత్రలకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో సమంత నటించిన ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ కు మాత్రం…

 

ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు తాజాగా ఓ పోస్ట్ వేసింది సమంత.దాంతో చిన్మయికి పెద్ద షాకే ఇచ్చినట్టు అయ్యింది. ‘కావాలనే సమంత.. చిన్మయిని పక్కన పెడుతుందా?’ అంటూ కొందరు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus