మెడలో పసుపు తాడు.. వైరల్ అవుతున్న సమంత లేటెస్ట్ ఫోటో..!

  • March 19, 2021 / 05:26 PM IST

‘ఏమాయ చేసావె’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత.ఆ చిత్రంలో ఈమె పోషించిన జెస్సి అనే పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. ఇక అటు తరువాత ఈమె చేసిన ‘బృందావనం’ ‘దూకుడు’ ‘ఈగ’ ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు అన్నీ సూపర్ హిట్లు అవ్వడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పటివరకూ తెలుగు,తమిళ భాషల్లో కలిపి 40కు పైగా సినిమాల్లో నటించింది సమంత. 2017 లో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథాప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేస్తుంది.

‘అఆ’ ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘యూటర్న్’ ‘ఓ బేబీ’ ‘మజిలీ’ వంటి సినిమాలు అన్నీ ఆ కోవకు చెందినవే కావడం విశేషం..! ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటూ వస్తోంది సమంత. తన భర్త చైతన్యతో దిగిన కొత్త కొత్త ఫొటోలతో పాటు తన లేటెస్ట్ ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అందులో ఓ ఫోటోని కనుక గమనిస్తే.. అందులో సమంత మెడలో పసుపుతాడు కనిపిస్తుంది. ఇప్పటివరకూ సమంత ఇలా దర్శనమిచ్చింది లేదు. దాంతో ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్లో ‘శాకుంతలం’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది సమంత.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus