ఆ ప్రొజెక్ట్ లో చైతూ చేస్తే సమంత హీరోయిన్ గా నటించదట

Advertisement

ఒక్కోసారి లేడీస్ లాజిక్స్ ఏమిటో అస్సలు అర్ధం కావు. ఇప్పుడు సమంత లాజిక్ ఏమిటి అనేది ఆమె భర్త నాగచైతన్యకి కూడా అర్ధం కావడం లేదు. అసలు విషయం ఏమిటంటే.. “ఆర్ ఎక్స్ 100” లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం రవితేజతో సినిమా అనుకోని.. అది క్యాన్సిల్ అయ్యి నాగచైతన్య దగ్గరకి వచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడు చైతన్య. సినిమాలో సమంత కథానాయిక అయితే బాగుంటుందని భావించిన భూపతి ఆమెకు కథ చెప్పాడు.

ఇక్కడే వచ్చింది అసలు సమస్య. కథ నచ్చింది కానీ.. చైతన్య చేస్తే ఈ సినిమా చేయను అని చెప్పేసిందట సమంత. సమంత నో చెప్పడంతో చైతన్య కూడా ఆ ప్రొజెక్ట్ ను లైట్ తీసుకొన్నాడు. దాంతో సేమ్ స్క్రిప్ట్ ను శర్వానంద్ కి చెప్పి ఒకే చేయించుకున్నాడు అజయ్ భూపతి. ఇదే ప్రొజెక్ట్ ను శర్వానంద్ చేస్తున్నాడని తెలుసుకున్న సమంత.. “శర్వా చేస్తే నేను ఈ సినిమా చేస్తాను” అని దర్శకుడికి ఓ మెసేజ్ పంపిందట. “చైతూ చేస్తే నో చెప్పిన సమంత.. శర్వా చేస్తే ఎందుకు ఎస్ చెప్పిందా” అని చాలాసేపు ఆలోచించిన అజయ్ భూపతి సినిమాలో హీరోకి హీరోయిన్ వెన్నుపోటు పొడిచే సందర్భం ఉండడం వల్ల సమంత ఆ డెసిషన్ తీసుకొందని గ్రహించి.. సినిమాలో క్యారెక్టర్ ప్లే చేయడానికి కూడా ఈ భార్యలు ఇంతలా ఆలోచిస్తారా అని షాక్ అయ్యాడట. మరి ఈ “మహా సముద్రం”లో ఇంతకీ సమంత నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news