టాలీవుడ్ లక్కీ లేడీ సమంత స్టార్ హీరోల ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరోల వలే స్టార్ హీరోయిన్స్ డిఫరెంట్ రోల్స్ ఎందుకు ట్రై చేయరు అని అడుగగా. హీరోయిన్స్ కి సోలో హిట్ రావడం అనేది కష్టం. హీరోయిన్స్ ఎంత కష్టపడినా ప్రేక్షకులకు నచ్చదు, కానీ ఓ స్టార్ హీరో స్క్రీన్ పై అలా నడుచుకుంటూ వెళితే చాలు ప్రేక్షకులు పిచ్చెక్కి పోతారు. హీరోలకు ఉండే క్రేజ్ అలాంటిది. స్టార్ హీరోకి వరుసగా మూడు ప్లాప్స్ వచ్చినా నాలుగు సినిమాను కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. హీరోయిన్స్ కి ప్లాప్స్ వస్తే వారి కెరీర్ సాగదు.. అన్నారు.
ఇంకా సమంత మాట్లాడుతూ ఓ బేబీ మూవీ హిట్ అయినంత మాత్రాన నేను సోలోగా చేసే తరువాత సినిమా కూడా జనాలు చూస్తారనే గ్యారంటీ ఉండదు. ఒక హీరోకి ఉండే అట్రాక్షన్ లో కనీసం ఒక శాతం కూడా హీరోయిన్స్ కి ఉండదు, అన్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత కష్టపడినా వారికి హీరోలతో సమానమైన గుర్తింపు ఉండదని సమంత సూటిగానే చెప్పింది. సమంత చాల విషయాలు ముక్కుసూటిగా చెప్పివేస్తుంది. గతంలో కూడా హీరో హీరోయిన్స్ మధ్య రెమ్యూనరేషన్ విషయంలో వ్యత్యాసం ఎందుకు ఉంటుందని ఆమె ప్రశ్నించింది.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!