ఎన్టీఆర్ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నరసింహుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సమీరా రెడ్డి. ఆ చిత్రం తరువాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘జై చిరంజీవ’ చిత్రంలో కూడా హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఆ రెండు సినిమాలు సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్.. ‘అశోక్’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. తరువాత ఒక్క ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో తప్ప మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు సమీరా రెడ్డి. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల పై స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. ‘స్టార్ల వారసులను ఎంకరేజ్ చెయ్యడం కోసం నేను చెయ్యాల్సిన మూడు సినిమాల నుండీ నన్ను తప్పించారు. ‘ఎందుకు నన్ను తప్పించారు?’ అని ఓ చిత్రనిర్మాతను ప్రశ్నిస్తే… ‘ఈ పాత్రకు నువ్వు చెయ్యలేవు లే. నీకు అంత ట్యాలెంట్ లేదు. ఆ కారణంగానే నువ్వు వద్దు’ అంటూ చెప్పాడు. అయితే నిజమేంటో నాకు తెలీక… నాకు ‘నిజంగానే ట్యాలెంట్ లేదేమో’ అని నిరుత్సాహపడేదాన్ని. కానీ అసలు విషయం స్టార్ కిడ్స్ కోసమని తర్వాత తెలిసింది.
నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కూడా ఉన్నాయి. ఓ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు.. ‘ ముద్దు సీన్ కోసం నన్ను కంగారు పెట్టాడు. స్క్రిప్ట్ పరంగా అయితే ముద్దు సీన్ లేదు కదా’ అని నాకు అనుమానం వచ్చి అడిగాను. అప్పుడు ‘నిన్ను సినిమాలో నుండీ తీసెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు తెలుసా’ అంటూ భయపెట్టే ప్రయత్నం చేసాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి’ అంటూ సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.
Most Recommended Video
వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!