RRRలో ఛాన్స్ ఎలాక్ వచ్చిందంటే: సముథ్రకని

  • January 15, 2021 / 08:09 PM IST

కొంతమంది తమిళ హీరోలతో పాటు తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా తెలుగులో భారీగా డిమాండ్ పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా కొందరైతే చాలా బిజీగా మారుతున్నారు కూడా. అలాంటి అతికొద్ది నటీనటులలో సముథ్రకని ఒకరు. కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న సముథ్రకని అతి తక్కువ సమయంలో తెలుగు ఆడియేన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యారు. దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించిన ఆయన

నటుడిగా మారిన తరువాత భారీ స్థాయిలో ఆఫర్స్ అందుకుంటున్నారు. ఇటీవల క్రాక్ లో నెగిటివ్ రోల్ తోనే స్క్రీన్ పై సరికొత్తగా దర్శనమిచ్చారు. అసలు మ్యాటర్ లోకి వస్తే RRR సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సముథ్రకని డైరెక్టర్ రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి చెప్పాడు. క్రాక్ కు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సముథ్రకని.. డైరెక్టర్ రాజమౌళితో స్నేహం ఇప్పటిది కాదు అంటూ దాదాపు 11 ఏళ్ళ నుండి కూడా బాగా పరిచయమని చెప్పాడు.

శంభో శివ శంభో మొదట తమిళ్ లో తీసినప్పుడే రాజమౌళి ఎంతగానో మెచ్చుకున్నట్లు చెప్పిన సముథ్రకని ఆ తరువాత నటుడిగా కూడా చాలాసార్లు మెచ్చుకున్నారని అన్నాడు. ఇక ఆ చొరవతోనే RRR సినిమాలో ఒక మంచి పాత్రలో ఛాన్స్ ఇచ్చినట్లు వివరణ కూడా ఇచ్చాడు సముథ్రకని.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus