Samyuktha Menon: అవును నేను డ్రింక్ చేస్తాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్!

Ad not loaded.

సినిమా ఇండస్ట్రీలో నటీనటులు తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టరు. అభిమానుల అభిప్రాయాలు, సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనే భయంతో కొందరు అసలు నిజాలు చెప్పరు. పర్సనల్ లైఫ్ లో పలు అలవాట్లను, కొన్ని విషయాలను తెగేసి చెప్పే ధైర్యం మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే, ఇప్పుడు లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon) మాత్రం తన ఓ అలవాటును అంత సింపుల్‌గా చెప్పేసింది. తెలుగు ప్రేక్షకులకు బింబిసార (Bimbisara), సార్ (Sir), విరూపాక్ష (Virupaksha)  వంటి హిట్ సినిమాలతో దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్వయంభు (Swayambhu) , అఖండ 2 (Akhanda) సినిమాలతో బిజీగా ఉంది.

Samyuktha Menon:

వరుస హిట్స్‌తో కెరీర్ పరంగా మంచి ఊపులో ఉన్న ఈ భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలు చెప్పింది. అయితే అందులో ఆమె చెప్పిన ఓ కామెంట్ మాత్రం ఫ్యాన్స్‌లో మిశ్రమ స్పందనను తెచ్చింది. ‘‘అవును.. నాకు ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంది. కానీ అది రొజూ తాగడం కాదు. టెన్షన్ ఎక్కువైనప్పుడు మాత్రమే కొంచెం తీసుకుంటా..’’ అని ఆమె చాలా బోల్డ్‌గా చెప్పేసింది. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి విషయాలను బహిరంగంగా చెప్పడానికి సంకోచిస్తారు.

ఫ్యాన్స్, ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీలోని వ్యక్తులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానంతో అలాంటి విషయాలను బయటపెట్టరు. కానీ సంయుక్త మాత్రం దాని గురించి పెద్దగా ఆలోచించకుండా ఓపెన్‌గా చెప్పేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్టేట్‌మెంట్‌తో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.

కొందరు ‘‘అంత ఓపెన్‌గా చెప్పడం నిజాయితీకి నిదర్శనం’’ అంటుంటే, మరికొందరు ‘‘హీరోయిన్లు ఇలాంటి మాటలు బయటపెడితే చాలా మంది వాళ్లను ఇన్‌స్పిరేషన్‌గా ఫాలో అవుతారు.. కాబట్టి జాగ్రత్త’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి, సంయుక్త మీనన్ తన వ్యక్తిగత విషయాన్ని ఇంత ఓపెన్‌గా చెప్పడంతో మరోసారి తన బోల్డ్‌నెస్‌తో వార్తల్లో నిలిచింది.

కుటుంబంతో పవన్ కుంభమేళా పుణ్యస్నానం.. ఆ దర్శకుడు కూడా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus