ileana: రెండోసారి తల్లి అవుతున్న స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోతో క్లారిటీ ఇచ్చి..!

Ad not loaded.

నేను గర్భవతిని అని చెప్పకుండా.. గర్భవతిని అని చెప్పడం ఎలా? ఈ మాటతో ఓ స్టార్‌ హీరోయిన్ తను ప్రెగ్నెంట్‌ అని చెప్పింది. ఇప్పుడు ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రియేటివ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చిన ఆ నాయిక మన దగ్గర ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌, ఇప్పుడు ఎక్కడా పెద్దగా సినిమాలు లేవు అనుకోండి. ఆమెనే ఇలియానా (Ileana). ఒక‌ప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగి ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లి స్థిర‌ప‌డింది.

ileana

హిందీలో ‘బ‌ర్ఫీ’ (Barfi!), ‘రుస్తుం’, ‘దో ఔర్‌ దో ప్యార్‌’ (Do Aur Do Pyaar), ‘రెయిడ్‌’, ‘ది బిగ్‌ బుల్‌’ (The Big Bull) ఇలా మంచి మంచి సినిమాలు చేసింది. అయితే వరుస సినిమాలు అయితే చేయడం లేదు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం మైఖేల్ డోల‌న్ అనే విదేశీయుడిని పెళ్లాడింది. అయితే ఆమె గ‌ర్భ‌వ‌తి అయ్యేవ‌ర‌కు వీరి బంధం గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. బిడ్డ‌ను క‌న్న‌పుడే భ‌ర్త గురించి వెల్ల‌డించింది ఇలియానా. 2023లో జ‌న్మ‌నిచ్చిన మ‌గ‌బిడ్డ‌ పేరు కోవా ఫోనిక్స్ డోల‌న్.

అలా తన విషయంలో గోపత్య పాటించే ఆమె.. ఇప్పుడు రెండో బిడ్డ విషయంలో కాస్త ముందుగానే చెప్పేసింది. ఇలియానా మ‌ళ్లీ ప్రెగ్నెంట్ అని, రెండో బిడ్డ‌కు త్వరలో జ‌న్మ‌నివ్వ‌బోతోంద‌ని ఇటీవల ప్ర‌చారం మొద‌లైంది. ఇప్పుడు ఆ విష‌యం వాస్త‌వమే అని ఆమెనే వెల్లడించింది. ఆమె లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు చూస్తే రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న విష‌యం మనకు అర్థమవుతుంది.

కుర్‌కురేతో, చూయింగ్ గ‌మ్స్ ప్యాకెట్లు ఉన్న ఓ ఫొటోను ఇలియానా షేర్ చేసింది. గర్భవతిగా ఉన్న క్రేవింగ్స్‌ ఎక్కువగా ఉంటాయని, అందులో ఆ ఫుడ్‌ తింటోంది అని అర్థమవుతోంది. దాంతోపాటే ‘మీరు ప్రెగ్నెంట్ అని చెప్ప‌కుండా ప్రెగ్నెంట్ అని తెలియజేయండి’ అనే క్యాప్ష‌న్ పెట్టింది. అస‌లు విష‌యం అర్థ‌మైపోయింది. దీంతో రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నందుకు ఇలియానాకు (ileana) శుభాకాంక్ష‌లు అంటూ మెసేజ్‌లు, కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus