అర్జున్ రెడ్డి డైరెక్టర్ నెక్స్ట్ పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాడట

  • April 28, 2020 / 03:59 PM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫేట్ మార్చి వేసింది. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో ఫస్ట్ సినిమాతోనే భారీ ఫేమ్ తెచ్చుకున్నాడు. పైగా ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు.

అయితే సందీప్ ఈ సారి కూడా బాలీవుడ్ హీరోతోనే తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.ఆయన టాలీవుడ్ లో ప్రభాస్ తో మూవీ చేయనున్నాడని వార్తలు వచ్చినా నాగ్ అశ్విన్ తో మూవీ ప్రకటన తరువాత అవి పుకార్లని తేలిపోయింది. ఇక కబీర్ సింగ్ భారీ హిట్ అందుకున్న నేపథ్యంలో హిందీ నిర్మాతలు సందీప్ వంగ సినిమాల కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ వంగ తర్వాతి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

మొత్తానికి మొదటి సినిమా ఛాన్స్ కోసం సంవత్సరాలు తరబడి తిరిగాడు. కానీ, ఇప్పుడు అడగకుండానే స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం సినిమా అవకాశాలు ఇస్తున్నారు. అందుకే తన తరువాత సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ లోని టాప్ స్టార్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుందని వినికిడి. అలాగే సందీప్ వంగ ఈ మూవీ నిర్మాణంలో కూడా పాలుపంచుకోనున్నాడట.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus