విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ అనే గేమ్ చేంజర్ చిత్రాన్ని తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు సందీప్ రెడ్డి వంగా. తరువాత ఈ డైరెక్టర్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అప్పటికి మన స్టార్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేకపోవడంతో ‘అర్జున్ రెడ్డి’ నే హిందీలోకి ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు సందీప్. దాంతో అక్కడి నిర్మాతలు ఇతనితో సినిమాలు రూపొందించడానికి ముందుకొస్తున్నారు.
సందీప్ సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు. అయితే సందీప్ చూపు పాన్ ఇండియా సినిమాల పై ఉందని తెలుస్తుంది. ప్రభాస్ తో సినిమా చెయ్యాలని మొన్నటివరకూ ట్రై చేసాడు. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో ఇతని దృష్టి ఇప్పుడు ‘కెజిఎఫ్’ హీరో యష్ పై పడినట్టు టాక్. మరో నెలలో ‘కె.జి.ఎఫ్2’ షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ఈ క్రమంలో సందీప్.. హీరో యష్ కోసం ఓ పాన్ ఇండియా సబ్జెక్టుని రెడీ చేసుకుంటున్నాడట.
ఇది కూడా పూర్తిగా పీరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కనుక ఓకే చేయించుకుంటే పాన్ ఇండియా లెవెల్లోనే దీనిని తెరకెక్కించాలని సందీప్ భావిస్తున్నాడట. అలా జరగాలి అంటే ముందుగా.. సందీప్ స్క్రిప్ట్ కు యష్ ఓకే చెప్పాలిగా..!
Most Recommended Video
ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!