బాలీవుడ్ ప్రొజెక్ట్ సెట్ చేసుకున్న సంకల్ప్ రెడ్డి

  • February 26, 2020 / 01:41 PM IST

“ఘాజీ” చిత్రంతో ఒకేసారి టాలీవుడ్, బాలీవుడ్ ను తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. అనంతరం “అంతరిక్షం”తో ఆకట్టుకోలేక చతికిలపడ్డాడు. “అంతరిక్షం” తర్వాత సంకల్ప్ కి తెలుగులో ఆశించిన స్థాయి అవకాశాలు రాలేదు. దాంతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ లోని ఎపిసోడ్ ను డైరెక్ట్ చేసే పనిలో పడ్డాడు. ఆ షూటింగ్ & ఎడిటింగ్ పనులు పూర్తవ్వడంతో ఇప్పుడు అర్జెంట్ గా ఒక సినిమా సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు సంకల్ప్. అయితే.. తెలుగు దర్శకనిర్మాతలు కానీ.. హీరోలు కానీ సంకల్ప్ కి సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో బాబు బాలీవుడ్ మీద కాన్సన్ ట్రేట్ చేయడం మొదలెట్టాడు.

అందులో భాగంగా రాసుకున్న ఒక కథను తెలుగు, హిందీ సినిమాల్లో విలన్ గా నటించి.. ప్రస్తుతం హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇబ్బందిపడుతున్న విద్యుత్ జమ్వాల్ తండ్రికి నచ్చిందట. ఆయన అభీష్టం మేరకు విద్యుత్ కోసం ఈ కథను డవలప్ చేసే పనిలో పడ్డాడు సంకల్ప్. మరి హీరోలు కాదనడంతో విలన్ తో మొదలెట్టిన ఈ జర్నీ ఏమేరకు ఫలిస్తుందో చూడా

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus