విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది.3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఆల్రెడీ ‘రంగస్థలం’ రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పుడు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్స్ ని కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 31.38 cr |
సీడెడ్ | 14.39 cr |
ఉత్తరాంధ్ర | 15.86 cr |
ఈస్ట్ | 11.51 cr |
వెస్ట్ | 7.23 cr |
కృష్ణా | 8.04 cr |
గుంటూరు | 8.80 cr |
నెల్లూరు | 3.78 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 100.99 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.55 cr |
ఓవర్సీస్ | 13.36 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 120.90 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 11 రోజుల్లో రూ.120.9 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.79.9 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. రెండో వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.