క్రేజీ ప్రాజెక్ట్ నుండి అనిరుధ్ అవుట్!

  • March 11, 2021 / 03:24 PM IST

కోలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమాను మొదలుపెట్టారు. సీనియర్ హీరో విక్రమ్, ఆయన కుమారుడు ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా సిమ్రాన్ నటించనుంది. ముందుగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

కానీ ఇప్పుడు అనిరుధ్ ని తప్పించి.. మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాసనన్ ని తీసుకున్నారు. దీనికి సంబంధించి దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఇదిలా ఉండగా.. విక్రమ్, ధృవ్ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ధృవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్క సినిమా మాత్రమే చేశాడు. అది కూడా ‘అర్జున్ రెడ్డి’ సినిమా రీమేక్.

ఏడాదిన్నర క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. ఆ తరువాత ధృవ్ హీరోగా మరో సినిమా మొదలుకాలేదు. తన తండ్రితో కలిసి చేస్తున్నదే అతడి రెండో సినిమా. విక్రమ్ కి ఇది 60వ సినిమా కావడం విశేషం. వీరిద్దరిని కార్తిక్ సుబ్బరాజ్ తెరపై ఎలా చూపించబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం విక్రమ్ ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus