అదంతా ఒక్కరోజు హడావుడే!

“సర్దార్ గబ్బర్ సింగ్” తొలిరోజు 30 కోట్ల షేర్ సాధించి.. సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. దాంతో సినిమా ఫ్లాప్ అని బాధపడుతున్న అభిమానులందరూ ఒక్కసారిగా సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు.
అయితే.. ఈ ఆనందం ఈ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం అంటున్నారు ట్రేడ్ ఎనలిస్ట్ లు. ప్రీ-రిలీజ్ క్రేజ్ పుణ్యమా అని భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే.. సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో శనివారానికి బుకింగ్స్ కొంతమేరకు తగ్గాయి. ఇక ఆదివారం అయితే థియేటర్లలో 60% ఆక్యుపెన్సీ కూడా లేదు.
సో, లాంగ్ రన్ లో “సర్దార్” ఎటువంటి రికార్డ్స్ ను బ్రేక్ చేయలేదు. ఆ కారణంగా పవన్ అభిమానులందరూ చేస్తున్న హడావుడి మొత్తం “ఒక్కరోజు పండగ”లా మిగిలిపోనుంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఒక ఫ్లాప్ సినిమాకే ఈస్థాయి కలెక్షన్స్, ఓపెనింగ్స్ వస్తే- ఇక సినిమా సూపర్ హిట్టయితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహకుసైతం అందరి ప్రశ్నగా మారింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus