శర్వానంద్ హీరోగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో జనవరి 14 సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు కూడా చేయడానికి డిసైడ్ అయ్యారు. మరోపక్క ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కేవలం సంక్రాంతి పండుగ టైంని, శర్వానంద్ సంక్రాంతి ట్రాక్ రికార్డుని నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
మరి ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ వివరాలను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 4 cr |
| సీడెడ్ | 1.2 cr |
| ఆంధ్ర(టోటల్) | 4.8 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 10 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.80 cr |
| ఓవర్సీస్ | 1.2 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 12 కోట్లు |
‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొత్తంగా ఈ సినిమా రూ.12.5 కోట్ల షేర్ ను రాబడితే చాలు బ్రేక్ సాధించి క్లీన్ హిట్..గా నిలిచినట్టే. సో పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ఈ సినిమా సేఫ్ అయిపోవడం ఖాయం అనే చెప్పాలి