నాచురల్ స్టార్ నాని (Nani) వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబోలో తెరకెక్కిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) మూవీ మరో 36 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా 2 గంటల 54 నిమిషాల నిడివితో ఈ సినిమా విడుదల కానుందని వెల్లడైంది. అయితే సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. నాని హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఈ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మిడిల్ రేంజ్ హీరోలలో నాని నంబర్ వన్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోగా నాని బ్రేక్ చేయాల్సిన కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. సరిపోదా శనివారం సినిమాతో ఆ రికార్డ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో నాని, ఎస్జే సూర్య కాంబో సీన్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఎస్జే సూర్య (SJ Suryah) విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉంతుందని సెన్సార్ సభ్యుల నుంచి వినిపిస్తోంది.
సినిమాలో నాని మార్క్ డైలాగ్స్ తో ఉండే కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని భోగట్టా. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుందని, క్లైమాక్స్ సీన్ తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) లుక్స్ తో పాటు సినిమాలో పర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ కోసం నాని ఎంతో కష్టపడుతుండగా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వివేక్ ఆత్రేయ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. సరిపోదా శనివారం సినిమాకు బుకింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో సరిపోదా శనివారం ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెన్సార్ సభ్యులు రెండు చోట్ల ఒక పదాన్ని మ్యూట్ చేయాలని ధూమపాన నిషేధం అనే ట్యాగ్ ఇవ్వాలని సరిపోదా శనివారం మేకర్స్ కు సూచించారు. యు/ఎ సర్టిఫికెట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.