Allu Arjun: ఆన్లైన్ రచ్చకు రెస్పాండ్ అయ్యి.. గుట్టురట్టు చేసిన జనసేన ఎమ్మెల్యే!

అల్లు అర్జున్ (Allu Arjun) తన స్నేహితుడైన శిల్పరవినీ సమర్థిస్తూ నంద్యాల వెళ్లిన దగ్గర నుండి ‘మెగా వర్సెస్ అల్లు’ అనే రచ్చ సోషల్ మీడియా సాక్షిగా జరుగుతూనే ఉంది. ఇక మొన్న “ఆయ్” (AAY)  సక్సెస్ మీట్ లో బన్నీ వాసుని  (Bunny Vasu)   ఉద్దేశించి టీమ్ మెంబర్ ఒకరు “అటు పవన్ కల్యాణ్ ను (Pawan Kalyan) ఇటు అల్లు అర్జున్ ని మ్యానేజ్ చేస్తుండడం మాములు విషయం కాదు” అని చెబుతుండగా.. బన్నీ వాస్ వెంటనే మైక్ లాక్కుని లైవ్ ఫీడ్ ను కట్ చేయమని చెప్పడం లేనిపోని చర్చలకు దారి తీసింది.

Allu Arjun

ఇక బన్నీ మొన్న స్వయంగా “నా స్నేహితులు కోసం ఎక్కడికైనా వెళ్తాను” అంటూ ఇండైరెక్ట్ గా శిల్పారవి విషయంలో రెస్పాండ్ అవ్వడం పెద్దస్థాయిలో వైరల్ అయ్యింది. ఇక మొన్న అల్లు అర్జున్ మావయ్య అయిన చంద్రశేఖర్ రెడ్డి బన్నీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన తీరు కొందరికి మింగుడుపడలేదు, ఇక ఇవాళ జనసేన ఎమ్మెల్యే అయిన బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం తెలియదు..

ఉన్నదల్లా మెగా ఫ్యాన్స్ & చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే” అని కామెంట్ చేయడం మరోసారి సోషల్ మీడియాలో చిచ్చుపెట్టింది. మరీ ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ బన్నీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు అని డైరెక్ట్ కామెంట్ చేయడం అనేది “మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్” అనే వివాదాన్ని పబ్లిక్ చేసిందనే చెప్పాలి.

ఎందుకంటే.. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ రూల్ ను అతిక్రమించి ఇలా ఫ్యామిలీ గొడవలను ఉద్దేశించి కామెంట్ చేసే సాహసం చేయడు అనేది పచ్చి నిజం. మరి ఈ విషయం ఇంకా ఎంతవరకు వెళ్తుందో.. లేక ఇప్పటికైనా మెగా పెద్దలు కలగజేసుకొని ఈ విషయమై ఒక క్లారిటీ ఇస్తారో చూడాలి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus