Pushpa 3: బన్నీ అభిమానులకి ఇది గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా?

“మారుతీ నగర్ సుబ్రమణ్యం” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒకటికి రెండుసార్లు బన్నీ స్వయంగా “డిసెంబర్ 6కి అస్సలు తగ్గేదే లే” అంటూ “పుష్ప 2” రిలీజ్ డేట్ ను స్వయంగా కన్ఫర్మ్ చేసినప్పటికీ.. ఇప్పటికీ సినిమా విడుదలపై అనుమానాలున్నాయి. ఈ విషయంలో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కంటే బన్నీ అభిమానులు ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకంటే.. అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా థియేటర్లోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. అలాంటిది ఈ ఏడాది కూడా సినిమా లేకపోతే ఎలా అని ఇబ్బందిపడిపోతున్నారు.

Pushpa 3 Movie Update

ఇటువంటి తరుణంలో.. “పుష్ప 3” కూడా ఉంది అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అక్టోబర్ చివరికల్లా “పుష్ప 2” (Pushpa 2) విడుదలైపోతుందని, ఈలోపు బన్నీ-అట్లీ కాంబినేషన్ సినిమా ఎనౌన్స్మెంట్ కూడా వస్తుందని తెలుస్తోంది. అయితే.. అట్లీ సినిమా తర్వాత అనుకున్న సందీప్ రెడ్డి వంగా చిత్రం సెట్స్ మీదకు వెళ్లడానికి ఓ నాలుగేళ్ళ టైమ్ పడుతుంది, ఎందుకంటే.. “స్పిరిట్, యానిమల్ పార్క్” పూర్తిచేసుకొని కానీ సందీప్ మరో సినిమా మీద కూర్చోలేడు. ఈలోపు బన్నీ “పుష్ప 3” పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

అయితే.. సుకుమార్ (Sukumar) వర్కింగ్ స్టైల్ అనుభవమున్న బన్నీ ఫ్యాన్స్ మాత్రం “పుష్ప 3” విషయంలో ఆనందం వ్యక్తం చేయడం లేదు. అంటే.. ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ ను సుకుమార్ వేస్ట్ చేసాడనే కోపం వల్ల అనుకోండి. మరి సుకుమార్ కూడా రామ్ చరణ్ తో సినిమా పూర్తి చేసుకొని వెంటనే “పుష్ప 3” వర్క్ మొదలెడతాడేమో చూడాలి.

ఇకపోతే.. “పుష్ప 2” సినిమా నుండి మూడో పాటను విడుదల చేయడం కోసం బృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఆ మూడో పాట తర్వాత ఒక టీజర్ & ఆ తర్వాత ట్రైలర్ ను విడుదల చేసి.. పార్ట్ 1 తరహాలో కాకుండా పార్ట్ 2కి ప్రోపర్ గా పాన్ ఇండియా ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు బృందం.

Nani Interview: సరిపోదా శనివారానికి ఎంత ప్రమోట్ చేసినా సరిపోవట్లేదు: నేచురల్ స్టార్ నాని

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus