కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy) కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హగన్) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది.
మొదటి రోజు ఈ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. కలెక్షన్స్ పర్వాలేదు అనిపించాయి. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.57 cr |
సీడెడ్ | 0.65 cr |
ఉత్తరాంధ్ర | 0.78 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.40 cr |
కృష్ణా + గుంటూరు | 0.54 cr |
నెల్లూరు | 0.24 cr |
ఏపి+ తెలంగాణ | 4.18 cr |
‘సత్యం సుందరం’ చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ చిత్రం రూ.4.18 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ఇంకా రూ.2.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ పోటీగా చాలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ‘సత్యం సుందరం’ ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.