World of Euphoria Glimpse Review: ‘యుఫోరియా’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) సినిమాలకి ఓ ప్రత్యేకత ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్లో ఆయన సినిమాలు ఉండవు. ‘చూడాలని వుంది’ ‘మనోహరం’ ‘ఒక్కడు’ ‘అర్జున్’.. ఇలా గుణశేఖర్ తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. గతంలో ఈయన్ని టాలీవుడ్ మణిరత్నం అనేవారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో విజువల్ స్టోరీ టెల్లింగ్ కానీ, డీటెయిలింగ్ కానీ.. ఆ రేంజ్లో ఉంటాయి. అయితే గుణశేఖర్ నుండి వచ్చిన గత చిత్రాల్లో ‘రుద్రమదేవి’ కొంతవరకు పర్వాలేదు అనిపించినా..

World of Euphoria Glimpse Review

‘శాకుంతలం’ నిరాశపరిచింది. దీంతో చారిత్రాత్మక కథలు పక్కన పెట్టి.. ఓ యూత్-ఫుల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు గుణశేఖర్. అందులో భాగంగానే ‘యుఫోరియా’ (World of Euphoria ) అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ‘రాగిణి గుణ’ సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి గ్లింప్స్ వదిలారు. దాదాపు 2 నిమిషాల నిడివి కలిగిన ఈ గ్లింప్స్..ను గమనిస్తే, ‘ఓ అమ్మాయి మెట్రో ట్రైన్లో డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలుతుంది.

ఆ తర్వాత అర్ధరాత్రులు అబ్బాయిల బైక్ రైడ్స్, పబ్బుల్లో అమ్మాయిలు మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి.. విజువల్స్ ఉన్నాయి. అదే క్రమంలో పబ్బు నుండి బయటకు వచ్చిన ఓ అమ్మాయిని కొంతమంది కుర్రాళ్ళు కారులో రేప్ చేస్తున్న విజువల్స్ చూపించారు. మొన్నామధ్య ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమ్మాయి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పడే ఆవేదనని ఇందులో చూపించారు.

మొత్తంగా యూత్- ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు ఓ మీనింగ్ ఫుల్ మెసేజ్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తీర్చిద్దుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇంకో విశేషం ఏంటంటే.. 2003 లో వచ్చిన ‘ఒక్కడు’ తర్వాత అంటే దాదాపు 21 ఏళ్ల తర్వాత గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో భూమిక నటిస్తుంది. ఆమె కూడా ఇందులో బోల్డ్ గా కనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా ‘యుఫోరియా’ గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఇప్పుడు పవను ను వెక్కిరించొచ్చు, కానీ తర్వాత అతనే కరెక్ట్ అంటారు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus