Salaar 2: నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?

సలార్1 (Salaar) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. సలార్1 సక్సెస్ సాధించడంతో సలార్ సీక్వెల్ పై భారీగా అంచనాలు పెరిగాయి. సలార్1 కు హైలెట్ గా కాటేరమ్మ ఫైట్ నిలవగా సలార్2 కు (Salaar 2) టన్నెల్ ఫైట్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది.

Salaar 2

సలార్ సీక్వెల్ కు సంబంధించి చాలా సన్నివేశాల షూట్ గతంలోనే పూర్తి కాగా టన్నెల్ ఫైట్ కు సంబంధించిన కొన్ని లీకైన పోస్టర్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా సలార్ సీక్వెల్ ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సీక్వెల్ కు సంబంధించిన లీక్స్ విషయంలో కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతుండటం గమనార్హం.

సలార్2 సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్2 సినిమా కోసం ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్2 (Salaar 2) సినిమాలో శృతి హాసన్ (Shruti Haasan)  రోల్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. సలార్ సీక్వెల్ పై ఇతర భాషల్లో సైతం అంచనాలు పెరుగుతుండగా ప్రభాస్ పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ సినిమా సినిమాకు లుక్ విషయంలో వేరియేషన్స్ చూపిస్తుండగా ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కన్నప్ప (Kannappa) , ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ది రాజాసాబ్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాలి.

ఇప్పుడు పవను ను వెక్కిరించొచ్చు, కానీ తర్వాత అతనే కరెక్ట్ అంటారు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags