ఓ స్టార్ హీరోయిన్ రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు అమీజాక్సన్ (Amy Jackson) . తెలుగు ప్రేక్షకులకి ఈమె సుపరిచితమే. విదేశీయురాలు అయినప్పటికీ సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ‘ఐ’ ‘తేరీ’ (Theri) ‘2 పాయింట్ ఓ’ (2.O) వంటి పెద్ద సినిమాల్లో నటించింది.ఆ తర్వాత టాలీవుడ్లో కూడా డెబ్యూ ఇచ్చింది. రాంచరణ్ (Ram Charan) హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవడు’ (Yevadu) సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేసింది.
అటు తర్వాత ‘అభినేత్రి’ అనే సినిమాలో కూడా నటించింది. అలాగే పలు హిందీ సినిమాల్లో కూడా నటించి తన రేంజ్, ఇమేజ్ పెంచుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో డేటింగ్ వంటి వ్యవహారాలతో ఈమె సినిమాలకు దూరమైంది. జార్జ్ పనాయొటో అనే వ్యక్తితో డేటింగ్ చేసిన ఈమె పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అయితే తర్వాత జార్జ్ తో మనస్పర్థలు రావడంతో అతనికి బ్రేకప్ చెప్పేసింది.
అతన్ని పెళ్లి చేసుకోలేదు.ఆ తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్-విక్..ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2024 లోనే వీరి వివాహం జరిగింది. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారట. అవును అమీ రెండోసారి తల్లి కాబోతున్నట్లు బేబీ బంప్ ఫోటో ద్వారా స్పష్టం చేసింది. ఈ ఫోటోలో తన భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.