Satyadev: సత్యదేవ్ గురించి పూరీ జగన్నాథ్ అలా అన్నారా?

  • October 10, 2022 / 10:55 AM IST

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. వేర్వేరు కారణాలు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. ఆచార్య రిజల్ట్ వల్ల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా రిజల్ట్ విషయంలో తెగ టెన్షన్ పడ్డారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయదేవ్ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించి మెప్పించారు. గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ కావడం వెనుక సత్యదేవ్ కృషి కూడా ఎంతో ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో సత్యదేవ్ మాట్లాడుతూ నేను లైఫ్ లో 50 పనులు చేయాలని చెక్ పాయింట్స్ రాసుకున్నానని చిరంజీవి గారి వల్ల గడిచిన వారం రోజులలో 30 చెక్ పాయింట్స్ పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. అన్నయ్య రీల్ లైఫ్ లో ఎంత గొప్ప మెగాస్టారో రియల్ లైఫ్ లో కూడా అంతే గొప్ప మెగాస్టార్ అని సత్యదేవ్ కామెంట్లు చేయడం గమనార్హం.గాడ్ ఫాదర్ రిలీజ్ రోజున తెగ టెన్షన్ పడ్డానని ఈ సినిమాతో నాకు బ్లాక్ బస్టర్ దక్కిందని సినిమాలో చేసింది సత్యదేవ్ కాదని మెగాస్టార్ ఫ్యాన్ అని సత్యదేవ్ పేర్కొన్నారు.

ఈ సినిమా వల్ల పదేళ్ల క్రితం 10,000 ఇవ్వాల్సిన వ్యక్తి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశాడని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ గారు రాత్రి 12 గంటలకు కాల్ చేశారని ఒక డైలాగ్ చెబుతానని బాగా చెబుతున్నానో లేదో చెప్పాలని ఆయన అడిగారని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ టిప్స్ చెప్పమని కోరగా కళ్లలో చూడకుండా చెప్పేయండి సార్ అని చెప్పానని సత్యదేవ్ కామెంట్లు చేశారు.

షూట్ అయ్యాక పూరీ జగన్నాథ్ ఫోన్ చేసి ఇచ్చావులే తొక్కలో సలహా నీకు సైట్ ఉంది నాకు లేదని ఆయన అన్నారని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. మోహన్ రాజా గారికి ఫాదర్ పై ఉన్న లవ్ ఇంత సక్సెస్ ను అందించిందని సత్యదేవ్ అన్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus