Satyadev: ఎంత కష్టపడినా.. సినిమా వర్కవుట్ అవ్వలేదే..?

  • October 26, 2022 / 01:02 PM IST

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. అతడు ఏ సినిమా చేసినా.. నటన పరంగా ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అతడి పెర్ఫార్మన్స్ ను పొగుడుతుంటారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు సత్యదేవ్. సినిమాలో అతడి రోల్ హైలైట్ గా నిలిచింది. ఈ టాలెంటెడ్ యాక్టర్ కి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి.

అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమాలో సత్యదేవ్ కి కీలకపాత్ర దక్కింది. అభిషేక్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. పురాణాలకు మాత్రమే పరిమితమైన రామ్ సేతుకి సంబంధించిన ఆధారాలను కనుగొని అది నిజంగానే ఉందని చెప్పే ప్రయత్నంతో సాగే సినిమా ఇది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.

ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గానే సాగింది. సెకండ్ హాఫ్ మాత్రం గాడి తప్పింది. ఈ సినిమా విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. సత్యదేవ్ పాత్ర, నటన విషయంలో మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సత్యదేవ్ రోల్ కనెక్ట్ అవుతుంది. ఫుల్ లెంగ్త్ లో సాగే అక్షయ్ కుమార్ పాత్ర కంటే సత్యదేవ్ పాత్ర, అతడి నటనే బావున్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉన్నా..

సత్యదేవ్ మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు సంపాదిస్తారేమో చూడాలి. ప్రస్తుతం తెలుగులో ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. సోలో హీరోగా మరిన్ని సినిమాలు ఒప్పుకుంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus