Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

సీనియర్ నటుడు కోటేష్ మానవ(Kotesh Manava).. ఇలా పేరు చెబితే కుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘మిర్చి’ సినిమాలో కాలేజీ ప్రిన్సిపాల్ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. ఇంకా ‘రంగస్థలం’ వంటి పెద్ద సినిమాల్లో ఈయన ముఖ్య పాత్రలు పోషించారు.

Kotesh Manava

సినిమా ప్రమోషన్స్ లో ఈయన ఎక్కువగా కనిపించరు.  అరుదుగా హాజరవుతుంటారు. అయితే ఊహించని విధంగా ఏరోజు ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావ్ : కనబడుటలేదు’ సక్సెస్ మీట్ కి హాజరయ్యారు.ఈ సిరీస్లో ఆయన కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్లో ఈయన స్పీచ్ ఇస్తూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా అవి స్టార్ హీరోలకి చురకలు అంటించే విధంగా ఉన్నాయని చెప్పాలి.

 

సీనియర్ నటుడు కోటేష్ మానవ మాట్లాడుతూ.. “ఇప్పుడు ధియేటర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్ళారా చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే.. ఇప్పుడు ఆడియన్స్ జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఇప్పటి సినిమాలు చూస్తుంటే.. మనమే చెప్పేస్తున్నాం. ఒక ఫైట్ కి ఎన్ని రోప్స్ కట్టి పైకి ఎలా లేపారు.. గ్రాఫిక్స్ వర్క్ ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు. వాటి మేకింగ్ వీడియోలు కూడా మేకింగ్ చూపిస్తున్నాం.

అవి చూసి ఆడియన్స్ ఇంకా స్ట్రిక్ట్ గా మారిపోతున్నారు. ఎందుకంటే.. హీరోకి బదులు డూప్ ని చూపిస్తున్నారు. అప్పుడు సినిమాపై ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది?” అంటూ మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. చాలా మంది ప్రేక్షకులు ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus