Dubbing Janaki: ఒకప్పటి హీరోల గురించి సీనియర్ నటి డబ్బింగ్ జానకి కామెంట్స్ వైరల్!

Advertisement

డబ్బింగ్ జానకి .. అంటే ఇప్పటి ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ‘సాగర సంగమం’లో కమల్ హాసన్ తల్లిగా చేసి ఆమె బాగా పాపులర్ అయ్యారు. తర్వాత స్టార్ హీరోలందరికీ తల్లి పాత్రలు చేశారు. ‘జంబ లకిడి పంబ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఈమె నటించి మెప్పించారు. విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ,గత ఏడాది వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు.

ఇటీవల ఈమె (Dubbing Janaki) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఒకప్పటి హీరోల గురించి చేసిన కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి.డబ్బింగ్ జానకి గారు మాట్లాడుతూ.. “ఒకప్పుడు నేను ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు..లతో కలిసి నటించాను. నాకు అందరూ మంచి స్నేహితులు. శోభన్ బాబు గారితో కలిసి ఒక డ్రామా కోసం రిహార్సల్స్ చేశాను. ఆ టైంలో లాగుడు రిక్షాలు ఉండేవి. ఆ లాగుడు రిక్షా వాళ్ళు ‘పావలా’ తీసుకునేవారు. ఆ పావలా కూడా ఆయన దగ్గర ఉండేది కాదు.

అంతగా ఆయన ఆర్థిక ఇబ్బందులు చూశారు. కెరియర్ స్టార్టింగ్ కావడం వలన నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను.నేను సంపాదించిన డబ్బు వృధా చేయలేదు. నా కుటుంబాన్ని గట్టెక్కించాను. మరో 4 కుటుంబాల వరకు సాయం చేశాను. రజనీ .. కమల్ .. విజయ్ కాంత్ తో కలిసి నటించాను. విజయ్ కాంత్ గారికి తన సినిమా షూటింగు పూర్తి కాగానే, అందరికీ బట్టలు పెట్టడం అలవాటు. రాజకీయాల్లోకి రావడానికి ముందే ఆయన ఎంతో మందికి సహాయం చేయడం నేను చూశాను” అంటూ చెప్పుకొచ్చారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus