కొంతమంది నటీమణులను ఎన్నేళ్లు గడిచినా కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు. ప్రస్తుతం అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో లక్ష్మీ కూడా ఉన్నారు. ఆమె అసలు పేరు యార్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి. 1968 లో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న లక్ష్మీ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగులో మురారి సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఓ బేబి సినిమాల్లో కూడా ఆమె నటించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే లక్ష్మి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆమె కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు అంతే కాకుండా మొదటి భర్త ని కాదని మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకోవడం అప్పట్లో అందరినీ షాక్ కు గురి చేసింది. లక్ష్మీ కేవలం 15 ఏళ్ల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇష్టం లేకపోయినప్పటికీ ఐదు సంవత్సరాలు జీవితాన్ని గడిపి అనంతరం కొన్ని మనస్పర్ధలు తో విడాకులు ఇచ్చేశారు.
అనంతరం మోహన్ శర్మ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె 1975లో రెండో పెళ్లి చేసుకొని మళ్ళీ 1980లో విడాకులు ఇచ్చేశారు. ఇక రెండు సార్లు విడాకులు తీసుకున్న అనంతరం ఆమెపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక మళ్ళీ ఏడు సంవత్సరాలు గడిచిన అనంతరం శివ చంద్రన్ అనే నటుడిని వివాహం చేసుకున్నారు. అప్పట్లో మూడో పెళ్లి చేసుకున్న సౌత్ నటిమణిగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఇక ఆ పెళ్లిళ్ల విషయంలో ఆమెకు పలుమార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎందుకు అలా పెళ్లిళ్లు చేసుకున్నారు అని అడిగినప్పుడు ఆమె అన్నిటికీ ఒకే ఒక సమాధానం చెప్పే వారు. ఒకరు తక్కువ నేను ఎక్కువ అనే అహం చూపిస్తే నాకు ఏ మాత్రం నచ్చదు మగాళ్ళు చూపించే గర్వం అధికారం అందుకు ఒక కారణం అని ఆమెన్ కౌంటర్ ఇచ్చారు. శివ చంద్రన్ తో తన జీవితం సంతోషంగా ఉందని ఆమె వివరణ ఇచ్చారు.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!