Adipurush: ప్రభాస్ ఆ పాత్రకు న్యాయం చేయగలరా..?

  • April 28, 2021 / 12:05 PM IST

ఈశ్వర్ సినిమా నుంచి సాహో సినిమా వరకు ప్రతి సినిమాలోని పాత్రకు ప్రభాస్ పూర్తిస్థాయిలో న్యాయం చేసి నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముని పాత్రలో నటిస్తున్నారు. అయితే రాముని పాత్రలో నటించి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం తేలిక కాదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇప్పటికే ఈ పాత్ర కొరకు తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. ప్రభాస్ తన సినీ కెరీర్ లో ఎక్కువగా మాస్ రోల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. రాముడి పాత్ర అంటే సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మెప్పించాల్సి ఉంటుంది.

పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుండగా బడ్జెట్ లో ఎక్కువ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కే నిర్మాతలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ సీనియర్ ఎన్టీఆర్ మాయాబజార్ సినిమాకు ముందు రెండు సినిమాలలో కృష్ణుడి వేషం వేస్తే ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించలేదని అలా జరగడంతో ఎన్టీఆర్ బాధపడ్డారని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత కేవీ రెడ్డి బాగా మేకప్ సెట్ చేసి మాయాబజార్ తో కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేలా చేశారని బీకే ఈశ్వర్ వెల్లడించారు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం గురించి బీకే ఈశ్వర్ సందేహం వ్యక్తం చేశారు. రాముడి పాత్రలో చేయడం సులభం కాదని రాముడిగా డైలాగ్ డెలివరీ, డిక్షన్, హావభావాలు పలికించడం ప్రభాస్ కు సాధ్యమేనా..? అంటూ బీకే ఈశ్వర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ మూవీలోని రాముడి పాత్రతో మెప్పిస్తారో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus