దిల్ రాజు ‘షాదీ ముబారక్’ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • March 4, 2021 / 03:30 PM IST

‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సాగర్ హీరోగా దృష్యా రఘనాథ్ హీరోయిన్ గా పద్మశ్రీ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించింది. దాంతో మార్చి 5న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

దాంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. వాటి వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం  0.80 cr
సీడెడ్  0.40 cr
ఉత్తరాంధ్ర  1.20 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  2.40 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్  0.15 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.55 cr

‘షాదీ ముబారక్’ చిత్రానికి రూ.2.55 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 2.9కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. దిల్ రాజు సినిమా కాబట్టి.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు బాగానే వస్తాయి. అయితే పోటీగా చాల సినిమాలు ఉన్నాయి కాబట్టి.. పాజిటివ్ టాక్ కచ్చితంగా వస్తేనే కానీ వర్కౌట్ కాదు. ఇక ఈ చిత్రం హిట్ అయితే సాగర్ కూడా హీరోగా నిలబడినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus