తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు, శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఎలా ఉండాలి అని చెప్పడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలి. గుడిలో ఉన్నప్పుడు, గుడి ప్రాంగణంలో ఉన్నప్పుడు వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. ఈ విషయం అందరికీ తెలుసు. తెలుగు ప్రజలు, విదేశాల నుండి వచ్చేవాళ్లు కూడా వీటిని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ విషయంలో కాస్త ఇబ్బంది కలుగుతోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమా జనాల వల్లే ఈ సమస్య వస్తోంది అని చెప్పొచ్చు.
మొన్నామధ్య ‘ఆదిపురుష్’ సినిమా ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చిన దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ ఇలానే ఇబ్బందిపెట్టారు. వాళ్లు చేసిన చిన్న పని వల్ల భక్తులు అసౌకర్యంగా ఫీలయ్యారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఆ సినిమా టీమ్ దగ్గరుండి మీడియాతో మాట్లాడి ఆ వీడియోలు సోషల్ మీడియా నుండి తొలగించే ప్రయత్నం చేసినా.. సాధ్యం కాలేదు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హీరో ఇలాంటి పనే చేశారు.
‘జవాన్’ సినిమా ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో పర్యటిస్తున్న స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన దేవాలయం నుండి బయటకు వస్తూ అక్కడున్న భక్తులకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. మూమూలుగా అయితే షారుఖ్‌కి ఇది అలవాటు. తన ఇంటి ముందు, షూటింగ్ స్పాట్లో, కార్యక్రమాల వేదిక మీద, ఈవెంట్లలో ఇలానే చేస్తుంటారు. అయితే తిరుమలలో ఇలా చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
షారుఖ్ ఖాన్, అతని తనయ సుహానా ఖాన్, నయనతార తదితరులు స్వామి వారిని ఈ రోజు దర్శించుకున్నారు. సోమవారం రాత్రే తిరుమలకు చేరుకున్న షారుఖ్ ఖాన్ మంగళవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీవారిని దర్శహంచుకున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా.. ఆ ఫ్లైయింగ్ కిస్ మాత్రమే ఇబ్బందుల్లో పెట్టింది అని చెప్పాలి. కొందరు నెటిజన్లు అయితే తిరుమలలో ఎలా ఉండాలో జాన్వీ కపూర్‌ను అడిగి తెలుసుకోండి అంటున్నారు. ఆమె తరచుగా తిరుమలకు వస్తుంటుంది. వచ్చినప్పుడల్లా పద్ధతిగా ఉంటుంది అని గుర్తు చేస్తున్నారు.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!