Jawan: షారుక్ ఖాన్ కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా..

  • May 8, 2023 / 11:52 PM IST

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ‘ప‌ఠాన్‌’ తో ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ రికార్డ్స్ క్రియేట్ చేశారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ . ఇప్పుడు మ‌రోసారి ‘జవాన్’గా ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌టంలో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో ‘జ‌వాన్’ సినిమా రూపొందుతోంది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘జవాన్’ సినిమాను సెప్టెంబ‌ర్ 7న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో.. మాస్క్ ధ‌రించిన హీరో ప‌దునైన ఈటెను ప‌ట్టుకుని ఎగురుతున్నాడు. పోస్ట‌ర్‌ను గ‌మనిస్తుంటే మ‌రోసారి షారూఖ్ మాస్ అండ్ ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్‌తో ఆక‌ట్టుకోనున్నాడనేది స్ప‌ష్ట‌మ‌వుతుంది. అంతకుముందు వచ్చిన ఫస్ట్ లుక్ లానే అతని శరీరమంతా కప్పబడి ఉంది. ఫేస్ కూడా క్లాత్‌తో కవర్ చేసినట్లుగా కనిపిస్తోంది.

చూస్తుంటే ఇదొక భారీ యాక్షన్ ఎపిసోడ్ అని అర్థమవుతోంది. షారూఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార. ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచ‌నాలు పెంచగా.. ఇప్పుడిచ్చిన అప్‌డేట్‌తో ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ వస్తుందా? అనేలా మేకర్స్ సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచేశారు.

తమిళ సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ ర‌విచందర్ఈ చిత్రానికి (Jawan) సంగీతం అందిస్తున్నారు. టాలివుడ్ లో సాయి ధర్మ తేజ్ జవాన్ టైటిల్ తో సినిమా తీసిన విషయం తెలిసిందే..అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.. ఇప్పుడు జవాన్ టైటిల్ తో షారుక్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏ స్థాయిలో సందడి చేసిందో చూడాలి..

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus