Shah Rukh Khan: డింపుల్ పై ముద్దు పెడతానన్నా నెటిజన్.. షారుక్ రియాక్షన్ ఇదే!

  • September 28, 2023 / 08:28 PM IST

బాలీవుడ్ బాద్షా సొట్ట బుగ్గల సుందరుడు నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తు ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఈయన పఠాన్ సినిమాతో పాటు జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలో కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి.

ఇకపోతే సినిమాల పరంగా షారుఖ్ ఖాన్ ఎంత బిజీగా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు ఇలా సోషల్ మీడియా వేదికగా కూడా షారుక్ ఖాన్ తన సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వస్తారు. తాజాగా అభిమానులతో ముచ్చటించినటువంటి ఈయనకు ఒక అభిమాని నుంచి విచిత్రమైనటువంటి ప్రశ్న ఎదురైంది.

ఈ సందర్భంగా ఒక లేడీ ఫ్యాన్ (Shah Rukh Khan) షారుక్ ఖాన్ ను ప్రశ్నిస్తూ నేను మీ డింపుల్ పై ముద్దు పెట్టుకోవచ్చా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు షారుఖ్ ఖాన్ షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ఈ ప్రశ్నకు రిప్లై ఇస్తూ దేనిపై ముద్దు పెట్టుకుంటారు కుడివైపు ఉన్న డింపుల్ నా? లేక ఎడమ వైపుదా అంటూ రిప్లై ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్ గా బుక్ చేసుకోండి అంటూ సమాధానం చెప్పారు.

ఈ విధంగా నేటిజన్ ప్రశ్నకు షారుఖ్ ఖాన్ ఇచ్చినటువంటి రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో షారుక్ ఖాన్ కి ఈ స్థాయిలో అభిమానులు ఉన్నారని చెప్పాలి ఇక ఈ మధ్యకాలంలో ఈయన తెలుగులో కూడా ఇదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జవాన్ సక్సెస్ లో ఉన్నటువంటి షారుక్ ఖాన్ త్వరలోనే డుంకి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus