బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సిద్ధార్థ మల్హోత్రా గత కొన్ని సంవత్సరాల నుంచి నటి కియారా అద్వానీతో ప్రేమలో ఉన్నారని వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి. ఇలా ప్రేమలో విహరిస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై వీరిద్దరూ ఏ మాత్రం స్పందించకపోవడంతో నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు.
ఇకపోతే సిద్ధార్థ మల్హోత్రా ఓ సందర్భంలో కియారా అద్వానీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలియజేశారు. ఇక తను జీవిత భాగస్వామి అయితే తన ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అంటూ కియారా అద్వానీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఈ విధంగా సిద్ధార్థ మల్హోత్రా కియారా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయ్యారు.ఇకపోతే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని మరొక స్టార్ హీరో వీరి పెళ్లి గురించి హింట్ ఇచ్చారు.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి కియారా అద్వానీ, షాహిద్ కపూర్ హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో భాగంగా షాహిద్ కపూర్ కియారా అద్వానీ,సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ… ఈ ఏడాది చివరి నెలలో కియారా అద్వానికి సంబంధించిన బిగ్ అప్డేట్ విడుదల కాబోతుందని ఈయన వారి పెళ్లి గురించి హింట్ ఇచ్చారు.
ఇలా డిసెంబర్ నెలలో బిగ్ అప్డేట్ రాబోతుందని చెప్పడమే కాకుండా ఈ అప్డేట్ సినిమాలకు సంబంధించినది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా షాహిద్ కపూర్ కియారా అద్వానీ,సిద్ధార్థ్ మల్హోత్ర ప్రేమ పెళ్లి గురించి ఇలా లీక్ చేయడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుబోతుందని వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ విషయంపై కియార అద్వాని మాట్లాడుతూ తనకు సిద్ధార్థ మల్హోత్ర స్నేహితుడు కంటే ఎంతో ఎక్కువ అని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రస్తుతం బీ టౌన్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?