Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

‘ఇరుముడి’ అనే సినిమా పేరు అనౌన్స్‌ చేసినప్పుడు, సినిమాలో రవితేజ లుక్‌ బయటకు వచ్చినప్పుడు, అయ్యప్పస్వామి పాట ఒకటి రిలీజ్‌ చేసినప్పుడు ఈ సినిమా డివోషనల్‌ పిక్చరా అనే ప్రశ్నలు లేవనెత్తారు. మొదట్లో ఈ కామెంట్లపై పట్టించుకోని చిత్ర దర్శకుడు శివ నిర్వాణ రీసెంట్‌గా ఓసారి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రధాన స్టోరీ ఏంటి అనేది క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పింది గానీ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మామూలుగా ఉండదు అని చెప్పొచ్చు.

Shiva Nirvana

రవితేజ, ప్రియా భవానీ శంకర్‌, బేబీ నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటివరకూ మాస్ మహారాజ ఒక ఎత్తు. ‘ఇరుముడి’ సినిమాలో జ్ఞమరో ఎత్తు అనేలా ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఇప్పటివరకు రవన్న చాలా మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేసినా ఈ సినిమా ఎందుకో కొత్తగా ఉంది. దానికి కారణం కూతురు సెంటిమెంట్‌, దేవుడి సెంటిమెంట్‌ అని చెప్పొచ్చు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ భార్య, కూతురే ప్రాణంగా బతికే ఓ మధ్య తరగతి తండ్రి కథే ‘ఇరుముడి’ అని రెండు ముక్కల్లో చెప్పేయొచ్చు.

అయితే, దర్శకుడు శివ నిర్వాణ మాత్రం మరో అర్థం కూడా చెప్పారు. ‘ఇరుముడి’ అంటే రెండు ముడులు అని. ఈ సినిమాలో హీరో – కూతురు మధ్య ఉన్న రెండు ముడులు, కుటుంబం అనే ఒక ముడి, కథలో వచ్చే ఓ మిస్టరీ ముడి.. ఇలా కొన్ని ఉన్నాయని. అవి సినిమాలో చూసినప్పుడు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తాయని చెప్పారు. నిజానికి ఈ ప్లాట్‌ ఏదో బాగుంది. మాలీవుడ్‌ సినిమాల్లో ఇలాంటి కాన్సెప్ట్‌ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆగస్ట్ 21న రానున్న సినిమా కోసం వెయిట్‌ చేయాల్సిందే.

మొన్నీమధ్య జోనర్‌ మార్చి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేసి ఫర్వాలేదు అనిపించిన రవితేజ.. ఇప్పుడు మరోసారి జోనర్‌+ సెటప్‌ మార్చి వస్తున్నాడు. ఈ సారి ఏం చేస్తాడో చూడాలి.

జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus