విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47). శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థపై సూర్య దేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన కొత్తలో.. మంచి హైప్ ఉండేది. అయితే సినిమా అనేక సార్లు వాయిదా పడటం వల్ల.. జనాల్లో ఆసక్తి తగ్గింది.
మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీక్ డేస్ లో డౌన్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 10.79 cr |
| సీడెడ్ | 2.53 cr |
| ఉత్తరాంధ్ర | 2.37 cr |
| ఈస్ట్ | 1.27 cr |
| వెస్ట్ | 1.15 cr |
| కృష్ణా | 1.57 cr |
| గుంటూరు | 1.48 cr |
| నెల్లూరు | 1.01 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 22.17 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.58 cr |
| ఓవర్సీస్ | 6.85 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 32.6 cr (షేర్) |
‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam AK 47) చిత్రానికి రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరోవైపు భారీ వర్షాలు. అయినప్పటికీ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ మొదటి సోమవారం నుండీ వసూళ్లు తగ్గిపోయాయి. మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా రూ.32.6 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.61.8 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.28.4 కోట్లు కలెక్ట్ చేయాలి.