Shiva Rajkumar: కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియా సినిమా!

  • October 25, 2022 / 07:17 PM IST

ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సినిమాలన్నీ భారీ విజయాలను అందుకుంటున్నాయి. ‘కేజీఎఫ్’తో మొదలుపెడితే.. ‘కాంతారా’ వరకు అన్నీ ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు కన్నడ వైపే చూస్తున్నాయి. దీంతో కన్నడలో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఎక్కువైంది. కన్నడ స్టార్ హీరోలు ఇతర భాషల ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. కరుణడ చక్రవర్తి డాక్టర్ శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’. బెంగుళూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

రూ.6 కోట్లతో రూపొందించిన జైలు సెట్ లో ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ‘ఘోస్ట్’ సినిమాలో శివరాజ్ కుమార్ ఇంటెన్స్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. శివరాజ్ కుమార్ నటించిన సినిమాలు ఇదివరకు తెలుగులో డబ్ అయ్యాయి. ఇప్పుడు ‘ఘోస్ట్’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టారాయన.

‘కేజీఎఫ్’, ‘కాంతారా’ సినిమాలకు ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లు మిగతా కన్నడ హీరోలకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ జైలు సెట్ లో జరుగుతోంది. అందులో 24 రోజుల పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు.

నవంబర్ 10వ తేదీకి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసి.. డిసెంబర్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘ఘోస్ట్’ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే విధంగా తెరకెక్కిస్తున్నారు. అర్జున్ జన్య ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus