Shivaji: చిరు, బాలయ్య, ఎన్టీఆర్ గురించి శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • June 1, 2024 / 07:54 PM IST

ఈ మధ్య కాలంలో శివాజీకి (Shivaji) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. 90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తో (90’s – A Middle-Class Biopic) పాటు బిగ్ బాస్ షో సీజన్7 ద్వారా కూడా శివాజీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం కెరీర్ ను కొనసాగించానని తాను నటించిన సినిమాలు మంచి సినిమాలే అని ఆ సినిమాల్లో హిట్లు కూడా ఉన్నాయని శివాజీ అన్నారు.

నాలా చాలామంది హీరోలు ఉన్నారని వాళ్లకు కూడా హిట్లు ఉన్నాయని అయితే నేను కానీ వాళ్లు కానీ మెగాస్టార్ (Chiranjeevi) అవ్వలేదుగా అని శివాజీ అన్నారు. బాలయ్య (Balakrishna) ఎందుకు ముఖ్యమంత్రి కాలేదనే ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదని శివాజీ వెల్లడించారు. ప్రతిభ ఉంటే ఎవరూ ఎవరిని ఆపలేరని టైమ్ అన్నీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్ లోకి రావచ్చని శివాజీ తెలిపారు.

కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయాలకు దూరంగా ఉండవచ్చని ఆయన అన్నారు. ఒక కుటుంబం అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు, మనస్పర్ధలు సాధారణం అని ఆయన అన్నారు. చంద్రబాబు కొడుకు లోకేశ్ కు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉండవచ్చని శివాజీ వెల్లడించారు. కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తుందని శివాజీ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శివాజీ చేసిన కామెంట్స్ గురించి ఫ్యాన్స్ నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివాజీ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా ఆ సినిమాల ఫలితాలు శివాజీ కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయి. శివాజీ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. శివాజీ వయస్సు పెరుగుతున్నా ఆయనకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. శివాజీ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus