త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!

‘మీటూ’ ఉద్యమం తరువాత ‘నెపోటిజం’ కూడా బాగా పాపులర్ అయ్యిందనే చెప్పాలి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కారణంగా బాలీవుడ్ లో మొదలైన నెపోటిజం ఇష్యూ మెల్ల మెల్లగా సౌత్ కు కూడా పాకుతుంది అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సౌత్ లో ఈ టాపిక్ పై ఎప్పటినుండో చర్చ జరుగుతూనే వస్తుంది. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘త్రిష కూడా నెపోటిజం బాపతే’ అని అంటుంది నటి మీరా మిథున్.

సూర్య హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్’ చిత్రంలో .. ఈమె ఫ్రెండ్ భార్య పాత్రలో నటించింది. మరో రెండు సినిమాల్లో కూడా నటించింది. అంతేకాదు తమిళ ‘బిగ్ బాస్3’ లో కూడా ఈమె కంటెస్టెంట్ గా పాల్గొంది. అయినప్పటికీ ఈమెకు ఏమాత్రం గుర్తింపు దక్కలేదు. దానికి కారణం ‘నెపోటిజం’ అనే అంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె త్రిష పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. “గతంలో నా డ్రిస్సింగ్ స్టైల్‌ నే త్రిష కాపీ కొట్టేది.

5 ఫీట్ 5 ఇంచ్ హైట్ వుండే త్రిష సైడ్ క్యారెక్టర్లు చేసే నటి, అలాంటి ఆమెకు మెయిన్ హీరోయిన్ పాత్ర‌లు ఎలా ద‌క్కాయో అర్థం కావ‌డం లేదు. నా నుంచి పోటీని త‌ట్టుకోలేకే త్రిష కోలీవుడ్ మాఫియాతో చేరిపోయింది. అందుకే త్రిష న‌టించిన ‘ఎన్నైల్ అరిందాల్‌’ చిత్రంలో నేను న‌టించిన సీన్స్ ను చాలా వరకూ కట్ చేశారు” అంటూ మీరా మిథున్ కామెంట్స్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ కు నెటిజెన్ల నుండీ మిశ్రమస్పందన వస్తుంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus