ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువు కాదు. రేయింబవళ్లు తీవ్ర స్థాయిలో శ్రమించడంతో పాటు అదృష్టం కూడా కలిసొస్తే మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఒకప్పుడు రోజుకు 50 రూపాయల వేతనం అందుకున్న యశ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు. అయితే యశ్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం అనుభవించిన కష్టాలు మాత్రం అన్నీఇన్నీ కావు.
ఒక సాధారణ డ్రైవర్ కొడుకైన యశ్ నేడు కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదిస్తున్నారు. ఒకవైపు క్రేజీ ప్రాజెక్ట్ లలో హీరోగా నటిస్తూనే మరోవైపు యాడ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యశ్ సత్తా చాటుతున్నారు. యశ్ అసలు పేరు నవీన్ కాగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరును మార్చుకోవడం జరిగింది. తల్లీదండ్రుల బలవంతం వల్ల బాల్యంలో చదువుకున్న యశ్ బ్యాక్ స్టేజ్ కూలీగా కెరీర్ తొలినాళ్లలో 50 రూపాయలు అందుకున్నారు.
ఆ తర్వాత యశ్ సీరియల్స్ లో కెరీర్ ను మొదలుపెట్టి సీరియల్స్ ద్వారా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు. జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగించి ఒక్కో మెట్టు పైకి ఎదిగి యశ్ ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని సమాచారం అందుతోంది. యశ్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించడంతో పాటు కెరీర్ పరంగా మరింత ఎదిగే దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
యశ్ (Yash) సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. యశ్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. యశ్ తెలుగులో సైతం మార్కెట్ ను పెంచుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్లకు యశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!