అఖిల్ అక్కినేని త్వరలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.7ఏళ్ళ తరువాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో రాబోతున్న మూవీ ఇది. ‘జి.ఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ చిత్రం తరువాత అఖిల్ హీరోగా సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది.
‘ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఏజెంట్’ అనే పేరుని ఖరారు చేస్తూ నిన్న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ లుక్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం బాగానే ట్రెండ్ అయ్యింది లెండి.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అఖిల్ లుక్ టెస్ట్ కోసమే నిర్మాత ఏకంగా రూ.70 లక్షల వరకూ ఖర్చు చేసాడని తాజా సమాచారం. ఒక్క లుక్ టెస్ట్ కే ఇంత బడ్జెట్ పెడితే.. సినిమా పూర్తయ్యేసరికి ఎంత పెట్టాల్సి వస్తుంది అనే డిస్కషన్లు ప్రస్తుతం జోరందుకున్నాయి.
అఖిల్ కెరీర్ ప్రారంభం నుండీ ఇలాంటి అదనపు ఖర్చులు నిర్మాతలకు మామూలే. అఖిల్ మొదటి చిత్రమైన ‘అఖిల్’ షూటింగ్ ప్రారంభించడానికి ముందే.. నాగార్జున ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేయించాడు. ఆ తరువాత సినిమా రిలీజ్ అయ్యే వరకూ నిర్మాత అయిన నితిన్ చాలా వేడుకలు ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. అటు తరువాత ‘హలో’ మూవీ కోసం 2,3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లు జరిగాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా పాటల విషయంలో కూడా ఇదే హడావిడి కనిపిస్తుంది.మొత్తానికి అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టి.. ప్రేక్షకులు అతన్ని ఓన్ చేసుకునే వరకూ నిర్మాతలకు ఇలాంటి అదనపు ఖర్చులు తప్పవేమో..!
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!