Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి షాకింగ్ లీక్స్.. అలా ప్లాన్ చేశారంటూ?

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానున్నా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా మెగా అభిమానులకు ఒకింత స్పెషల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ రోల్ కు సంబంధించి మరో షాకింగ్ అప్ డేట్ వచ్చింది.

ఈ సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చరణ్ పిలుపునిస్తాడని సమాచారం అందుతోంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా రామ్ చరణ్ పోరాటం చేస్తాడని సమాచారం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తూ చరణ్ పాడే పాట సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈ సన్నివేశాలు ఉంటాయని ఈ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం అందుతోంది.

ఈ జనరేషన్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ పాట ఉండనుందని సమాచారం అందుతోంది. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టడం లేదు.

దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో (Game Changer) ఈ సినిమా తెరకెక్కుతుండగా దిల్ రాజు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. జీ స్టూడియోస్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. ఈ మధ్య కాలంలో పలు సినిమాల ఫలితాలు షాకివ్వడంతో కథల ఎంపికలో దిల్ రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus