Bichagadu2: బిచ్చగాడు2 మూవీ స్టోరీ గురించి షాకింగ్ సెటైర్లు.. ఏం జరిగిందంటే?

  • May 24, 2023 / 02:47 PM IST

విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు2 మూవీకి క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. బిచ్చగాడు1 స్థాయిలో ఈ సినిమా లేకపోయినా సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ కావడం ఈ మూవీకి ప్లస్ అయింది.

అయితే బిచ్చగాడు2 (Bichagadu2) సినిమాలో విజయ్ ఆంటోని విజయ్ గురుమూర్తి, సత్య పాత్రల్లో కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. అయితే సత్య పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు ఆ పాత్ర సన్నివేశాలన్నీ బాద్ షా మూవీలో కాజల్ చెప్పిన కథకు సంబంధించిన సన్నివేశాలు అని చెబుతుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరోవైపు బిచ్చగాడు3 కూడా తెరకెక్కనుందని 2025 సంవత్సరంలో ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. బిచ్చగాడు3 మూవీని భారీ రేంజ్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. బిచ్చగాడు2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ఉండబోతుందని విజయ్ ఆంటోని చెప్పారు. బిచ్చగాడు2 సినిమాలో కథనం మరింత అద్భుతంగా ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది.

విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు విజయ్ ఆంటోని సినిమాలు మంచి లాభాలను అందిస్తున్నాయి. విజయ్ ఆంటోని డైరెక్షన్ కు దూరంగా ఉంటే బాగుంటుందని కొంతమంది సూచనలు చేస్తున్నారు. బిచ్చగాడు2 సక్సెస్ తో విజయ్ ఆంటోని రెమ్యునరేషన్ కూడా పెరిగిందని సమాచారం అందుతోంది. సినిమాల కోసం విజయ్ ఆంటోని ఎంతో కష్టపడుతుండగా ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus