Veera Simha Reddy: బాలయ్య వీరసింహారెడ్డి మూవీ రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. వీరసింహారెడ్డి సినిమాలో హనీరోజ్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించగా ఈ ఇద్దరి పాత్రలకు మంచి పేరు వచ్చింది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించగా రెండు పాత్రలు సినిమాకు ప్లస్ అయ్యాయి.

గోపీచంద్ మలినేని ఈ సినిమాకు డైరెక్టర్ కాగా బోయపాటి శ్రీను స్టైల్ లో ఈ సినిమా ఉందని కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు అదిరిపోయే రేటింగ్ వచ్చింది. అయితే ఈ సినిమాకు స్టార్ మా మూవీకి షాకింగ్ టీఆర్పీ రావడం గమనార్హం. అర్బన్ ఏరియాలో ఈ సినిమాకు 8.83 రేటింగ్ రాగా రూరల్ ఏరియాస్ లో ఈ సినిమాకు 7.67 రేటింగ్ వచ్చింది.

ఒక విధంగా ఈ రేటింగ్ మంచి రేటింగ్ అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ప్రసారమైన చాలా సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ రేటింగ్ ను సొంతం చేసుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నారు. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కాజల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ఈ సినిమాలో సింగిల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా (Veera Simha Reddy) తెరకెక్కింది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus