Balakrishna: బాలయ్య బోయపాటి మూవీ ఆ సీన్ తో మొదలవుతుందట.. ఏమైందంటే?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అఖండ సినిమాకు సీక్వెల్ అని ఇంతకాలం ప్రచారం జరిగింది. మేకర్స్ సైతం గతంలో అఖండ సీక్వెల్ గురించి కామెంట్లు చేసిన నేపథ్యంలో బాలయ్య అఖండ సీక్వెల్ లో నటిస్తే ఆయన కెరీర్ కు కూడా ప్లస్ అవుతుందని అభిమానులు ఫీలయ్యారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ సినిమా లెజెండ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. లెజెండ్ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి ఈ సినిమా మొదలవుతుందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమాను ప్లాన్ చేశారని బోగట్టా.

2024 ఎన్నికల ముందే ఈ సినిమాను విడుదల చేయాలని (Balakrishna) బాలయ్య భావిస్తుండగా ఈ సినిమా రిలీజ్ సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో పాటు ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచని కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈతరం డైరెక్టర్లలో బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు పేరుంది.

బోయపాటి శ్రీను త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆరోజు ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అటు బాలయ్య ఇటు బోయపాటి రెమ్యునరేషన్ భారీగా ఉండగా ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాకు ఊహించని స్థాయిలో పోటీ ఉండటంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఇప్పటికే ఉన్న రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus